Balakrishna: బాలకృష్ణ ఓ డిక్షనరీలాంటి వారు: సుమంత్

  • చరిత్ర గురించి ఆయనకు అన్ని విషయాలు తెలుసు
  • ఎన్టీఆర్, ఏఎన్నార్ గారి డైలాగులు, వారి సినిమాల గురించి మొత్తం చెప్పేవారు
  • అన్నాచెల్లెళ్ల అనుబంధంతో సాగే సినిమాను చేయబోతున్నా

నందమూరి బాలకృష్ణ ఓ నిఘంటువులాంటి వారని హీరో సుమంత్ చెప్పారు. చరిత్ర గురించి ఆయనకు అనేక విషయాలు తెలుసని కితాబిచ్చారు. నాగేశ్వరరావు, రామారావు గారి డైలాగులు, వారి సినిమాల గురించి మొత్తం చెప్పేవారని అన్నారు. డైరెక్టర్ క్రిష్ అంటే తనకు చాలా ఇష్టమని... 'ఎన్టీఆర్' బయోపిక్ గురించి చెప్పేసరికి కళ్లు మూసుకుని ఒప్పుకున్నానని తెలిపారు. ఈ సినిమాలో తాతగారి పాత్రను పోషించడం ఒక గౌరవమని చెప్పారు. తాను నటించిన 'సుబ్రహ్మణ్యపురం' ఈ నెల 7న విడుదలవుతోందని... 'ఇదం జగత్' విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో సాగే ఒక సినిమాను చేయబోతున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News