Srikant: మా సినిమాకు వచ్చిన రివ్యూలను చూసి బాధేసింది: శ్రీకాంత్

  • 'ఆపరేషన్ 2019' మంచి సంతృప్తిని ఇచ్చింది
  • రివ్యూలు రాసేవాళ్లు ఆలోచించి రాయాలి
  • సినిమా సక్సెస్ మీట్ లో శ్రీకాంత్
ఇటీవలి కాలంలో తాను నటించిన చిత్రాల్లో మంచి సంతృప్తిని ఇచ్చిన చిత్రం 'ఆపరేషన్ 2019' అని, కానీ, ఈ చిత్రంపై వచ్చిన రివ్యూలను చూసి బాధపడ్డానని నటుడు శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. శ్రీకాంత్ హీరోగా, కరణం బాబ్జీ దర్శకత్వంలో తయారైన'ఆపరేషన్‌ 2019' గత వారం విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌ లో జరుగగా, శ్రీకాంత్ మాట్లాడుతూ, అభిమానులు చిత్రాన్ని ఆదరిస్తున్నారని, కలెక్షన్లు బాగున్నాయని అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారని చెప్పిన శ్రీకాంత్, విమర్శకుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, ఇదే సమయంలో రివ్యూలు రాసేవాళ్లు కూడా కాస్త ఆలోచించి రాయాలని సలహా ఇచ్చారు. ఒక సినిమా బాగా ఆడితే, పరిశ్రమలో మరో పది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
Srikant
Operation 2019
Review
Success Meet

More Telugu News