dhanunjaya: 'భైరవగీత' కొత్త రిలీజ్ డేట్

  • విభిన్న ప్రేమకథా చిత్రంగా 'భైరవగీత'
  • కన్నడలో ఈ నెల 7న విడుదల 
  • తెలుగులో ఈ నెల 14న రిలీజ్

రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా సిద్ధార్థ దర్శకుడిగా 'భైరవ గీత' నిర్మితమైంది. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను ముందుగా నవంబర్ 30వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. సెన్సారు సంబంధమైన సమస్యల వలన డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా మరో మారు వాయిదా పడింది.

అనుకున్న స్థాయిలో ఎక్కువ స్క్రీన్స్ అందుబాటులో లేకపోవడం వలన, ఈ సినిమాను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కన్నడలో మాత్రం ముందుగా ప్లాన్ చేసుకున్నట్టే ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తున్నారు. ధనుంజయ, ఇరా నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో యూత్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి. దర్శకుడు సిద్ధార్థ మాత్రం ఈ సినిమా తన తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు.     

More Telugu News