AMB Cinemas: మహేష్ బాబు థియేటర్ లో ఇదే సమస్య!: రామ్ గోపాల్ వర్మ చమత్కారం

  • ఆదివారం నాడు ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్
  • సినిమా చూసి వచ్చిన రామ్ గోపాల్ వర్మ
  • థియేటర్ కు సరితూగే సినిమా తయారు కావడం కష్టమే
  • 'సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్' అంటూ కితాబు

ఆదివారం నాడు హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సొంత థియేటర్ల సముదాయం 'ఏఎంబీ' ప్రారంభం కాగా, అక్కడికి వెళ్లి ఓ సినిమాను చూసి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

 "ఇప్పుడే నేను ఏఎంబీ సినిమాస్ లో ఓ చిత్రాన్ని చూసి వచ్చాను. ఈ సూపర్ ప్లెక్స్ లో ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే, ఇంత అద్భుతమైన థియేటర్ కు సరితూగేలా ఓ సినిమా తయారుకావాలంటే చాలా కష్టం. ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్" అని వ్యాఖ్యానించాడు.

నిన్న ఈ థియేటర్లను హీరో కృష్ణ ప్రారంభించడం జరిగింది. తొలి చిత్రంగా '2.ఓ'ను ప్రదర్శిస్తున్నారు. అత్యాధునిక సౌండ్, ప్రొజక్షన్ సిస్టమ్ తో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ ఈ థియేటర్ల ప్రత్యేకత. నడుం వాల్చి కూడా ఇక్కడ సినిమాను చూసే అవకాశం కల్పించారు. బెడ్ షీట్స్ ఉండే ఈ తరహా థియేటర్ తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది.




More Telugu News