CEC: మారిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్... రావత్ స్థానంలో అరోరా బాధ్యతల స్వీకరణ!

  • శనివారం నాడు పదవీ విరమణ చేసిన రావత్
  • నేడు బాధ్యతలు స్వీకరించిన సునీల్ అరోరా
  • పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అరోరా నేతృత్వంలోనే

న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాన ఎన్నికల అధికారిగా సునీల్ అరోరా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఈసీగా వ్యవహరించిన ఓపీ రావత్ శనివారం నాడు పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో అరోరాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు, త్వరలో జరగనున్న జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు అరోరా నేతృత్వంలో జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. సమాచార ప్రసారాల శాఖతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖల కార్యదర్శిగా పనిచేసిన అరోరా, రాజస్థాన్ కేడర్‌ కు చెందిన 1980 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి.

More Telugu News