Jana Sena: జనసేన అధికార ప్రతినిధి విజయబాబు రాజీనామా

  • వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకున్నట్లు వెల్లడి
  • పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న విస్మయం
  • ఆర్టీఐ కమిషర్‌గా పనిచేసిన విజయబాబు

జనసేన పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు రాజీనామా చేశారు. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లో కలకలానికి కారణమైంది. పలువురు నాయకులు ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీని వీడుతున్నట్లు విజయబాబు ప్రకటించారు. ఒకటి రెండు రోజులు ఆగితేగాని అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News