Hyderabad: హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం... ఇద్దరి మృతి!

  • మూసాపేట ఫ్లయ్ ఓవర్ పై ప్రమాదం
  • డివైడర్ ను దాటి పాదచారులపైకి వెళ్లిన బస్సు
  • ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన స్థానికులు
హైదరాబాద్ నడి రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. మూసాపేట ఫ్లయ్ ఓవర్ పై వేగంగా వస్తున్న బస్సు, అదుపు తప్పి, డివైడర్ ను దాటి నడుస్తూ వెళుతున్న ముగ్గురిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి సైతం ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు బస్సు డ్రైవర్ పై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మూసాపేట ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. భరత్ నగర్ నుంచి ఎస్సార్ నగర్ వరకూ ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
Hyderabad
Road Accident
TSRTC
Police
Moosapet

More Telugu News