Brahmaji: ట్విట్టర్‌లో 'వదిన'పై బ్రహ్మాజీ, హరీశ్ శంకర్ ల సరదా ట్వీట్లు!

  • ట్రాఫిక్ అవగాహనపై బ్రహ్మాజీ ట్వీట్
  • ఫన్నీగా స్పందించిన హరీశ్ శంకర్
  • నెటిజన్ల సరదా వ్యాఖ్యలు

దర్శకుడు హరీశ్ శంకర్, నటుడు బ్రహ్మాజీల మధ్య జరుగుతున్న ట్వీట్ల సంభాషణ ఇప్పుడు నెటిజన్లను అలరిస్తోంది. తొలుత బ్రహ్మాజీ ఓ ట్వీట్ ను పెడుతూ, "నిదానంగా వెళ్లండి. మీ కోసం ఇంటి వద్ద అదే భార్య ఎదురు చూస్తూ ఉంటుంది" అంటూ ట్రాఫిక్ పై అవగాహన కల్పించేలా ఓ ట్వీట్ పెట్టాడు.

 దీన్ని చూసిన హరీశ్ శంకర్, "ట్విట్టర్ లో వదిన లేరనేగా నీ ధైర్యం" అంటూ ఫన్నీగా స్పందించగా, "ఈ పిక్ ను షేర్ చేసింది వదినే" అని బ్రహ్మాజీ సమాధానం ఇచ్చాడు. ఈ ఫన్నీ ట్వీట్లపై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తూ, పలు రకాల కామెంట్లను పెడుతున్నారు.




  • Loading...

More Telugu News