Renigunta: చిత్తూరు జిల్లాలో ఘోరం... ఐదుగురి మృతి!

  • రేణిగుంట సమీపంలో ఘటన
  • లారీని ఢీకొన్న కారు
  • మృతులంతా కడప జిల్లా వాసులు
ఈ తెల్లవారుజామున చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద వేగంగా వస్తున్న కారు (ఏపీ 04 బీకే 0765) ఓ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుకాగా, మృతుల్లో ఏడాదిన్నర చంటిబిడ్డ కూడా ఉంది.

వీరంతా వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలానికి చెందిన వారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.
Renigunta
Chittoor District
Road Accident

More Telugu News