KTR: 'ఏపీలో వేలుపెడతా' అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై శోభారాణి ఘాటు కౌంటర్!

  • ఓడిపోతామన్న భయంతోనే ఈ వ్యాఖ్యలు
  • కేటీఆర్ పై ఈసీ చర్య తీసుకోవాలి
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవన్న శోభారాణి
"ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మేము ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాం" అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మహిళా నేత శోభారాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని, కేటీఆర్ పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు చేసే వేళ రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని కేటీఆర్ కు హితవు పలికిన ఆమె, ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి ఏం సాధించాలని అనుకుంటున్నారో కూడా చెప్పాలని కోరారు.  
KTR
Sobharani
Andhra Pradesh
Telangana
Elections
Politics

More Telugu News