UFBU: విలీనాన్ని నిరసిస్తూ.. 26న బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె

  • బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా, విజయ బ్యాంకుల విలీనం
  • విలీనమైతే అతిపెద్ద బ్యాంకుల్లో మూడోది అవుతుంది
  • బ్యాంకుల స్థిరీకరణకే తమ తొలి ప్రాధాన్యం

ఈ నెల 26న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె జరగనుంది. బ్యాంకు ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నట్టు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా, విజయ బ్యాంకులను విలీనం చేయాలని గత సెప్టెంబర్ 17న ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి విలీనమైతే దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో మూడోది అవుతుంది. బ్యాంకుల స్థిరీకరణకే తమ తొలి ప్రాధాన్యమని, అందులో భాగంగా మొదటి అడుగు వేశామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు.

More Telugu News