Shankar Nayak: టీఆర్ఎస్ అభ్యర్థికి ‘గబ్బర్‌సింగ్’ గ్యాంగ్ ప్రచారం!

  • టీఆర్ఎ‌కి మద్దతుగా ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ ప్రచారం
  • సంక్షేమ కార్యక్రమాలను వివరించిన గ్యాంగ్
  • శంకరన్నను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

శంకరన్న మంచి వ్యక్తి కావడంతో హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వచ్చి మరీ ప్రచారం నిర్వహిస్తున్నామంటోంది ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్.  టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా, ఆ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన అంత్యాక్షరి టీమ్ మొత్తం ఈ ప్రచారంలో పాల్గొంది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

More Telugu News