kcr: కేసీఆర్ ను మహాత్మా గాంధీతో పోల్చడం సిగ్గుచేటు: స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి

  • హామీలు నెరవేర్చని కేసీఆర్ కు ఎందుకు ఓటెయ్యాలి?
  • తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు
  • చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు తగదు

సీఎం కేసీఆర్ ని మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తితో పోల్చడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆమె ఈ రోజు రోడ్ షో లో పాల్గొన్నారు. ఇంటికి నల్లాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.

కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, తిడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్, చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. డబ్బు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని, ప్రజలు డబ్బుకు లొంగరన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News