Chandrababu: ఏం తమ్ముళ్లూ! కేసీఆర్, ఒక్క ఫ్లై ఓవరైనా కట్టాడా?: చంద్రబాబు

  • హైటెక్ సిటీ, సైబరాబాద్.. నేను కట్టాను
  • కృష్ణా నీళ్లు తీసుకొచ్చాను
  • నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఏం చేశారు?/
తెలంగాణ సీఎం కేసీఆర్ తన నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క ఫ్లైఓవరన్నా కట్టాడా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కూకట్ పల్లిలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ‘ఏం తమ్ముళ్లూ! కేసీఆర్, ఒక్క ఫ్లై ఓవర్ కట్టాడా? నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఒక హైటెక్ సిటీ, సైబరాబాద్.. కట్టాను. కృష్ణా నీళ్లు తీసుకొచ్చాను. కేసీఆర్ గారూ, నాలుగున్నర సంవత్సరాల్లో చెప్పగలిగే పని ఒక్కటుందా?’ అని ప్రశ్నించారు.

ఏపీ, తెలంగాణలకు ద్రోహం చేసిన మోదీ

ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న అభివృద్ధి, మోదీ హయాంలో దిగజారిపోయిందని, రూపాయి విలువ పడిపోయిందని, ‘పెట్రో’ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ అని దుమ్మెత్తిపోశారు.
Chandrababu
kcr
kukatpally
Telugudesam
TRS

More Telugu News