TRS: కూటమి పార్టీలు ఆపదమొక్కులు మొక్కుకున్నాయి: ఎంపీ కవిత

  • కూటమి అభ్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
  • తెలంగాణలో చక్రం తిప్పేందుకే కాంగ్రెస్ తో బాబు పొత్తు
  • కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలో చెప్పాలి

ప్రజాకూటమిలోని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆపదమొక్కులు మొక్కుకున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత సెటైర్లు విసిరారు. జగిత్యాలలోని ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కు ప్రజల కష్టాలు తెలుసని, వారు అడగకుండానే అన్ని పనులు చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలో కొస్తే రైతులకు నీళ్లివ్వదని కూటమి అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ మాటలు నమ్మొద్దని కోరారు. ఎస్సారెస్పీలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, నీళ్లిచ్చే బాధ్యత తనదని రైతులకు తెలిపారు.

తెలంగాణలో చక్రం తిప్పేందుకే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకున్నారని కవిత విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భవిష్యత్ లో నీటి సమస్య వస్తే తెలంగాణకు చంద్రబాబు న్యాయం చేస్తాడా? ఏపీకి న్యాయం చేస్తాడా? అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కేసీఆర్ ను గద్దె దించాలని అంటున్నారని, ఎందుకు దించాలో చెప్పాలని మహాకూటమి నేతలను ప్రజలు ప్రశ్నించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News