varun thej: మెగా హీరో జోడీగా రష్మిక మందన .. దర్శకుడిగా హరీశ్ శంకర్

  • తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'
  • తెలుగులో రీమేక్ చేస్తోన్న హరీశ్ శంకర్ 
  • సిద్ధార్థ్ పాత్రలో వరుణ్ తేజ్
తమిళంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాలలో 'జిగర్తాండ' ఒకటి. సిద్ధార్థ్ .. బాబీసింహా కథానాయకులుగా నటించిన ఈ సినిమా, 2014లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దర్శకుడు హరీశ్ శంకర్ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర కోసం ఆయన వరుణ్ తేజ్ ను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక కథానాయికగా రష్మిక మందనను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. బాబీసింహా పాత్ర కోసం మరో హీరోను ఎంపిక చేయవలసి వుంది. హరీశ్ శంకర్ ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' .. బన్నీతో 'దువ్వాడ జగన్నాథం' .. సాయిధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' తెరకెక్కించాడు. ఇప్పుడు మరో మెగా హీరోతో 'జిగర్తాండ' రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళుతుండటం విశేషం.   
varun thej
rashmika mandana

More Telugu News