Chandrababu: జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానేమో కానీ.. తెలంగాణ రాజకీయాల్లోకి మాత్రం రాను: చంద్రబాబు

  • ప్రధాని కావాలనే కోరిక నాకు లేదు
  • రాజేంద్రనగర్ అభివృద్ధికి బీజం వేసింది నేనే
  • గణేష్ గుప్తాకు కార్తీక్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు
ఒకవేళ వెళ్లాలనుకుంటే జాతీయ రాజకీయాల్లోకి వెళతానని... తెలంగాణ రాజకీయాల్లోకి మాత్రం రానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని కావాలనే కోరిక తనకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తరపున పోటీ చేస్తున్న గణేష్ గుప్తా తరపును ఈరోజు ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణేష్ గుప్తాకు రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాల్సిన కార్తీక్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. రాజేంద్రనగర్ అభివృద్ధికి బీజం వేసింది తానేనని అన్నారు. 
Chandrababu
rajendranagar
Telugudesam
congress

More Telugu News