surya: పొలిటికల్ డ్రామా నేపథ్యాన్ని నమ్ముకున్న సూర్య

  • సెల్వరాఘవన్ తో సూర్య 
  • నాయికలుగా రకుల్ .. సాయిపల్లవి
  • తెలుగు .. తమిళభాషల్లో విడుదల

ఇటీవల కాలంలో సూర్య చేసిన సినిమాలు అంతగా విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన ఈ సారి పొలిటికల్ డ్రామాతో కూడిన 'ఎన్జీకే' చేస్తున్నాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో సూర్య కనిపించనున్నాడు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి ప్రవేశించి, రాష్ట్ర రాజకీయాలను ఎలా శాసించాడనే నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. సమకాలీన రాజకీయ పరిస్థితులను కూడా ఈ సినిమాలో టచ్ చేశారని అంటున్నారు.

రాజకీయాల నేపథ్యంలో తెలుగులో వచ్చిన 'భరత్ అనే నేను' .. తమిళంలో వచ్చిన 'సర్కార్' సినిమాలు ఘన విజయాలను సాధించడంతో, తన సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో సూర్య వున్నాడట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకే రోజున విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికలుగా రకుల్ .. సాయిపల్లవి కనిపించనున్నారు.   

More Telugu News