New Delhi: వంటకాలకు పోర్న్ స్టార్ల పేర్లు.. రెస్టారెంట్ యజమానిపై నెటిజన్ల ఆగ్రహం!

  • ఢిల్లీలో రెస్టారెంట్ బిత్తిరి చర్య
  • సన్నీ, మియా ఖలీఫా పేర్లతో మెనూ
  • దుమ్మెత్తిపోస్తున్ననెటిజన్లు
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అని పెద్దలు అన్నారు. తాజాగా ఓ హోటల్ యజమాని దీన్ని అక్షరాలా పాటించాడు. దీంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ లో చోటుచేసుకుంది.

ఢిల్లీలో ఓ వ్యక్తి ఇటీవల కొత్తగా రెస్టారెంట్ ను ప్రారంభించాడు. కొత్త మెనూ, సరికొత్త రుచులతో భోజన ప్రియులను మెప్పించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన తెలివితేటలకు పనిచెప్పాడు. వంటకాలకు శృంగార తారలైన సన్నీలియోన్, మియా ఖలీఫా, బేబీ డాల్ పేర్లను పెట్టాడు.

ఈ నేపథ్యంలో రెస్టారెంట్ కు వెళ్లిన ఓ కస్టమర్ ఈ విచిత్రమైన మెనూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది. తినే వంటకాలకు సన్నీ లియోన్ చాప్‌, మియా ఖలీఫా చాప్, బేబీ డాల్ చాప్‌ వంటి పేర్లు పెట్టడంపై పలువురు నెటిజన్లు రెస్టారెంట్ ఓనర్ పై మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎదుటివారు చేసే పని ఏదైనా వారిని గౌరవించాలని చెబుతున్నారు.
New Delhi
restaurant
Sunny Leone
mia khalifa
Social Media
Viral

More Telugu News