charan: త్వరలో 'వినయ విధేయ రామ' నుంచి ఫస్టు సాంగ్

  • అనుబంధాల నేపథ్యంలో సాగే కథ 
  • సోమవారం రోజున ఫస్టు సాంగ్ రిలీజ్ 
  • జనవరి 11వ తేదీన సినిమా విడుదల

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ .. టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. సోమవారం రోజున ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఆ రోజున ఎన్ని గంటలకు సాంగ్ ను రిలీజ్ చేసేది చెప్పనున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొనసాగుతుంది. బంధాలు .. అనుబంధాలు కుటుంబాన్ని ఎంత బలంగా నిలబెడతాయనే సందేశంతో ఈ కథ కొనసాగుతుంది. ఆ పాయింట్ కి సంబంధించి చిత్రీకరించిన పాటనే ఫస్టు సాంగ్ గా వదలనున్నారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.   

More Telugu News