ashwamedh yagna: అయోధ్యలో అశ్వమేధ యాగం ప్రారంభం

  • 'ఛలో అయోధ్య' పేరుతో ఆందోళనను ఉద్ధృతం చేసిన విశ్వవేదాంత సంస్థాన్
  • ఈరోజు నుంచి 4వ తేదీ వరకు అశ్వమేధయాగం
  • ఆలయ నిర్మాణ తేదీని ప్రధాని ప్రకటించాలంటూ డిమాండ్

రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా విశ్వవేదాంత సంస్థాన్ 'ఛలో అయోధ్య' అనే నినాదంతో తన కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అయోధ్యలో అశ్వమేధయాగాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు ప్రారంభమైన యాగం నాలుగు రోజుల పాటు కొనసాగి 4వ తేదీన ముగియనుంది.

ఈ సందర్భంగా విశ్వవేదాంత సంస్థాన్ అధికార ప్రతినిధి ఆనంద్ జీ మహారాజ్ మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణం కోసం తమ ఆందోళనను ఉద్ధృతం చేశామని తెలిపారు. తమ ఆందోళన ప్రజా ఆందోళనగా మారడాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం తప్పదని... ఇటువంటి పరిస్థితిలో కూడా జాప్యం జరుగుతుండటం సరికాదని అన్నారు.

ఆలయ నిర్మాణం తేదీని ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అశ్వమేధయాగంలో 1000 మంది రుత్విక్కులు పాల్గొంటున్నారని చెప్పారు. 11,000 మంది సాధువులు హాజరవుతున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఈ యాగమే తొలి అడుగని చెప్పారు.

  • Loading...

More Telugu News