madhavaram krishnarao: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కూకట్ పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు

  • మాధవరం కృష్ణారావుపై భూకబ్జా ఆరోపణలు
  • తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న మాధవరం
  • సుహాసిని చుట్టూ ఉన్నవారు ముందు భూకబ్జాలను ఆపేయాలంటూ సూచన
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ స్థానం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శల పట్ల టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు స్పందించారు.

భూకబ్జాలకు తాను పాల్పడినట్టు నిరూపిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. టీడీపీ అభ్యర్థి సుహాసిని చుట్టూ ఉన్న నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ముందు వారు భూకబ్జాలకు పాల్పడటం ఆపాలని సూచించారు. తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని... నిరూపితం కాకపోతే ఆరోపణలు చేసిన వారు తప్పుకోవాలని అన్నారు. 
madhavaram krishnarao
suhasini
kukatpalli
TRS
Telugudesam

More Telugu News