kukatpalli: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రచారం

  • సెటిలర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దింపిన టీడీపీ
  • చంద్రబాబు హయాంలో నగరం అభివృద్ది చెందిన విషయాన్ని గుర్తించాలని విన్నపం
  • కేసీఆర్‌ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని పిలుపు
శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున ప్రచారం చేశారు. సెటిలర్లు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో టీడీపీ వ్యూహాత్మకంగా ఆయనను రంగంలోకి దించింది. పార్టీ శ్రేణులు కూడా రామ్మోహన్‌నాయుడుకు ఘన స్వాగతం పలికాయి.

ఈ సందర్భంగా మూసాపేట సభలో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని అప్పగిస్తే తన కుటుంబ పాలనతో వారి ఆశలను వమ్ము చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో వారి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. సుహాసిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
kukatpalli
mp rammohannaidu

More Telugu News