lagadapati: తెలంగాణలో ఏ పార్టీ హవా లేదు.. హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పను
  • తెలంగాణలో త్రిముఖ, బహుముఖ పోటీ ఉంది
  • ఒకవేళ ‘హంగ్’ వస్తే టీఆర్ఎస్ కు మద్దతివ్వబోం

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పను కానీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఐదుగురికి మించి గెలిచే అవకాశాలు మాత్రం లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ ఉందని, చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లకు గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

అయితే, తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశమే లేదని చెప్పిన లగడపాటి వ్యాఖ్యలతో మాత్రం జీవీఎల్ ఏకీభవించలేదు. తెలంగాణలో ఏ పార్టీ హవా లేదని, హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల్లో పరిస్థితులు మారినప్పుడు మాత్రమే ఇండిపెండెంట్లు ఇంత పెద్ద సంఖ్యలో గెలిచే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ హంగ్ ప్రభుత్వం వస్తే కనుక టీఆర్ఎస్ కు మద్దతివ్వబోమని అన్నారు. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే ఉన్నాయని, ఇంకా, ఆ రెండు పార్టీలు కొత్తగా కలిసేదేముందని సెటైర్లు విసిరారు. గతంలో చంద్రబాబు కూడా కేసీఆర్ తో కలిసి ఉండాలనుకున్న వారేనని జీవీఎల్ పేర్కొన్నారు.

More Telugu News