kcr: వెకిలి, నకిలీ సర్వేలను పట్టించుకోవద్దు: సీఎం కేసీఆర్

  • మధుసూదనాచారిని లక్ష మెజార్టీతో గెలిపించాలి
  • ఉద్యమం నాటి నుంచి ఆయన నాకు కుడిభుజం
  • రాహుల్ గాంధీ బతుకే ‘కమీషన్’

వెకిలి, నకిలీ సర్వేలను పట్టించుకోవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ కు మళ్లీ పట్టం కట్టడం ఖాయమని చెప్పారు. భూపాలపల్లిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మధుసూదనాచారిని గెలిపిస్తే, ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉండరని, ఇప్పటికే ఉన్నత పదవిలో ఉన్న ఆయన మరింత ముందుకు వెళతారని అన్నారు.

తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మధుసూదనాచారి తనకు కుడిభుజంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన విరుచుకుపడ్డారు. కమీషన్లు తీసుకున్నామని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్ బతుకే కమీషన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నాయకుల్లాగా తాము ఇసుక దందాలు చేయలేదని, తెలంగాణలో భూ కుంభకోణాలు, లంబకోణాలు లేవని, శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. నాడు తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించిన కేసీఆర్, ఇప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కుతున్నారని దుయ్యబట్టారు. రైతులు ధనవంతులు అయ్యే వరకు ఆదుకునే బాధ్యత తనదని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసి తీరతానని మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News