modi: కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం: సీఎం కేసీఆర్

  •  పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తా
  • రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేస్తా
  • మోదీ ముప్పై కోట్లు తిన్నారని నేను ఆరోపిస్తే కుదురుతుందా?

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొస్తే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని, వారికి అవసరమైన పత్రాలు ఇచ్చి వారికీ రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ పై ఆయన విరుచుకుపడ్డారు. మోదీ ముప్పై కోట్ల రూపాయలు తిన్నారని తాను ఆరోపిస్తే కుదురుతుందా? అని ప్రశ్నించారు. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో బెయిల్ పై వచ్చిన రాహుల్ గాంధీ సైతం తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే రాజీవ్, ఇందిర, నెహ్రూల పేర్లను పెడతారని, స్థానికంగా ఉన్న గొప్ప వ్యక్తుల పేర్లు వారికి కనపడవా అని ప్రశ్నించారు. అందుకే, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేర్లను తీసేసి ‘సీతారామ’ అన్న భగవంతుడి పేరు పెట్టామని స్పష్టం చేశారు.

More Telugu News