nandamuri: రాజకీయ అరంగేట్రం సందర్భంగా చంద్రబాబు నాకు ఆ సలహా ఇచ్చారు!: నందమూరి సుహాసిని

  • తెలంగాణలో రాక్షస పాలన సాగుతోంది
  • దానికి చరమగీతం పాడండి
  • ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను
కూకట్ పల్లి లో మహాకూటమి(ప్రజాకూటమి) అభ్యర్థిగా తనను ఎంపిక చేసినప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సూచన చేశారని నందమూరి సుహాసిని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలనీ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బాబు సూచించారన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పారన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలకననీ, కూకట్ పల్లిలో అభివృద్ధి పనులతో జవాబు చెబుతానని వ్యాఖ్యానించారు. మహాకూటమికి ఓటు వేసి రాక్షస పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూకట్ పల్లిలో తనను గెలిపిస్తే ఆసుపత్రి నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. 
nandamuri
suhasini
Telangana
kukatpalli
Chandrababu
Telugudesam
suggestion

More Telugu News