baba ramdev: యోగా గురు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

  • బాబా రాందేవ్ జీవితంపై పుస్తకాన్ని రూపొందించిన జగ్గెర్నాట్ బుక్స్
  • పుస్తకం ప్రచురణ, విక్రయాలు చేపట్టవద్దన్న ఢిల్లీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన జుగ్గెర్నాట్ బుక్స్

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, జుగ్గెర్నాట్ బుక్స్ అనే సంస్థ బాబా రాందేవ్ జీవితంపై 'గాడ్ మ్యాన్ టు టైకూన్' పేరుతో పుస్తకాన్ని రూపొందించింది. అయితే, ఈ పుస్తకంలో తన ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలున్నాయని... తన గౌరవానికి, ఆర్థిక ప్రయోజనాలకు ఇవి భంగం కలిగిస్తాయని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును రాందేవ్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ప్రచురించడం, విక్రయించడం చేయరాదని గత నెల 29న హైకోర్టు ఆదేశించింది. దీంతో, ప్రచురణకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

More Telugu News