venkatesh: సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోన్న 'వెంకీ మామ'

  • బాబీ దర్శకుడిగా మల్టీ స్టారర్ 
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • చైతూ సరసన నాయికగా రకుల్

వెంకటేశ్ .. నాగచైతన్య ప్రధాన పాత్రలుగా దర్శకుడు బాబీ ఒక కామెడీ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి 'వెంకీ మామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వచ్చేనెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయి.

తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో చైతూ జోడీగా రకుల్ ను తీసుకున్నారు. వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను గానీ .. హ్యూమా ఖురేషిని గాని తీసుకునే ఆలోచనలో వున్నారు. 'జై లవ కుశ' తరువాత బాబీ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.    

More Telugu News