టీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం : పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ
- రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామనడం విడ్డూరం
- ఎంతమందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారో ధర్మారెడ్డి చెప్పాలి
- మీ ఆడబిడ్డగా మళ్లీ గెలిచి రుణం తీర్చుకుంటానని స్పష్టీకరణ
నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని చల్లా ధర్మారెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారో ఆయన చెప్పాలని నిలదీశారు. కొండా దంపతులపై అభిమానంతో నియోజకవర్గం ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి మీ ఆడబిడ్డగా రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఆమె వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.