bellamkonda: '2.ఓ'కి పాజిటివ్ టాక్ .. వెనక్కి తగ్గని 'కవచం'!

షార్ట్స్‌లో చూడండి
శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' సినిమా చేశాడు. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికలుగా కాజల్ .. మెహ్రీన్ నటించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

అయితే '2.ఓ'కి పాజిటివ్ టాక్ వస్తే 'కవచం' విడుదల తేదీ వాయిదా పడొచ్చని అంతా అనుకున్నారు. నిన్న థియేటర్లకు వచ్చిన '2.ఓ' సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా తమ సినిమాను ముందుగా చెప్పినట్టుగా డిసెంబర్ 7వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ సినిమాను పూర్తిగా చూసి కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా కంటెంట్ పై నమ్మకంతోనే ఉన్నారట. ఇక ఇదే రోజున 'సుబ్రహ్మణ్యపురం'.. 'భైరవగీత'.. 'హుషారు' థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ పోటీని 'కవచం'ఎలా తట్టుకుంటుందో చూడాలి మరి.  
Go Back to Shorts
bellamkonda
kajal
mehreen

More Telugu News