Mahabubabad District: రోడ్డు ప్రమాదం... పాదచారితోపాటు ద్విచక్ర వాహన చోదకుని మృతి

  • నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన మోటారు సైక్లిస్ట్‌
  • ఘటనా స్థలిలోనే ఇద్దరి మృతి
  • మరో వ్యక్తికి తీవ్రగాయాలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు పాదచారి కాగా, మరొకరు ద్విచక్ర వాహన చోదకుడు. గురువారం అర్ధరాత్రి మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం బుద్దారం రైల్వేగేటు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

మహమ్మద్‌ రియాజ్‌ (25), ఎన్‌.సతీష్‌ అనే వ్యక్తితో కలిసి మోటారు సైకిల్‌పై వెళ్తున్నారు. రైల్వేగేటు వద్దకు రాగానే బండి అదుపుతప్పి నడిచి వెళ్తున్న గార్లకు చెందిన సిరిపంగి సురేష్‌ (29)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రియాజ్‌, సురేష్‌లు తీవ్ర గాయాలపాలై ప్రమాద స్థలిలోనే మరణించారని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Mahabubabad District
Road Accident
two died

More Telugu News