Telangana: టీడీపీని వీడే సమయంలో బాధపడ్డా... కేసీఆర్ బలవంతం మీదనే ఎన్నికల్లో పోటీ: తుమ్మల కీలక వ్యాఖ్యలు

  • ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు
  • సీతారామ ప్రాజెక్టు కోసమే వచ్చాను
  • పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, అయితే, కేసీఆర్ బలవంతం మీదనే బరిలోకి దిగానని పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరులో ప్రచారం నిర్వహించిన ఆయన, తాను తెలుగుదేశం పార్టీని వీడిన సమయంలో ఎంతో బాధపడ్డానని, అభివృద్ధి కోసమే నాడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇక్కడి తెలుగుదేశం కార్యకర్తలతో చర్చించిన మీదటే టీఆర్ఎస్ లో చేరానని చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే మరోమారు ప్రజల మద్దతు కోరుతున్నానని చెప్పారు. తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తుమ్మల.

  • Loading...

More Telugu News