Telangana: ‘తెలంగాణ’లో మేము అధికారంలో కొస్తే యూపీ తరహాలో యువతకు ఉపాధి కల్పిస్తాం: మాయావతి

  • మా పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది
  • మా పార్టీ తప్ప, అన్ని పార్టీలవి బూటకపు మేనిఫెస్టోలే
  • నాడు యువతకు ‘నిరుద్యోగ భృతి’ కాకుండా ఉపాధి కల్పించాం
కాంగ్రెస్, బీజేపీలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలు రిజర్వేషన్లను అమలు చేయడం లేదని, ప్రతిదీ ప్రైవేట్ రంగంలోకి మారుస్తూ అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయని విమర్శించారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని, ఏ పార్టీతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో కొస్తే యూపీ తరహాలో ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యూపీలో తమ హయాంలో యువతకు ‘నిరుద్యోగ భృతి’ కాకుండా ఉపాధి కల్పించామని చెప్పారు. కేవలం, తమ పార్టీ తప్ప, అన్ని పార్టీలు బూటకపు మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మాయావతి విమర్శించారు. 
Telangana
mahabubnagar
mayawati
bsp

More Telugu News