డిసెంబర్ 2 నుంచి కేసీఆర్ తదుపరి ప్రచార షెడ్యూల్ వివరాలు
- డిసెంబర్ 2 నుంచి 4 వ తేదీ వరకు ప్రచార సభలు
- 2న నాగర్ కర్నూల్, చేవెళ్ల.. హైదరాబాద్ లో సభలు
- 3న సత్తుపల్లి, మధిర, కోదాడ తదితర చోట్ల
డిసెంబర్ 2వ తేదీన నాగర్ కర్నూల్, చేవెళ్ల, పటాన్ చెరువు, హైదరాబాద్ లలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. డిసెంబర్ 3న సత్తుపల్లి, మధిర, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ సభలలో, డిసెంబర్ 4న అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్ లలో నిర్వహించే ప్రచార సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.