USA: టెక్నాలజీ తికమక.. జీపీఎస్ చెప్పిందని కారును రైలు పట్టాలపైకి తీసుకెళ్లిన మహిళ!

  • అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఘటన
  • ఘటనాస్థలానికి చేరుకుని కాపాడిన పోలీసులు
  • మద్యం, డ్రగ్స్ తీసుకోలేదని పరీక్షలో వెల్లడి

టెక్నాలజీని అన్నిసార్లు గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. తాజాగా జీపీఎస్ ను సీరియస్ గా తీసుకున్న ఓ మహిళ కారును డ్రైవ్ చేస్తూ రైల్వే ట్రాక్ పై చిక్కుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను కాపాడి ఎందుకమ్మా కారుతో ట్రాక్ పైకి వచ్చావ్? అని అడగ్గా, మ్యాప్స్ లో చూపించిన ప్రకారమే తాను కారును నడిపానని సదరు మహిళ జవాబిచ్చింది.

అగ్రరాజ్యం అమెరికాలోని డుక్వెన్స్ పట్టణంలో కొన్నిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్ పై కారు ఆగిపోయిన ఘటనలో అధికారులు సదరు మహిళకు డ్రగ్స్, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా, నెగటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే ఆమెకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. కాగా, ఈ ఫన్నీ ఘటనను అమెరికా పోలీసులు ఫేస్ బుక్ లో పంచుకున్నారు.

More Telugu News