Telangana: నల్గొండలో వేముల వీరేశం వర్సెస్ దుబ్బాక సతీశ్.. భారీగా మోహరించిన పోలీసులు!

  • నేరేడలో నేడు వీరేశం పర్యటన
  • బాకీ చెల్లించాలని సతీశ్ వర్గీయుల పోస్టర్లు
  • పర్యటన రద్దుచేసుకున్న వీరేశం
తెలంగాణలోని నల్గొండ జిల్లా నేరేడలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నకిరేకల్ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం పర్యటనను దుబ్బాక సతీశ్ రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ‘నాకు ఇవ్వాల్సిన రూ.30 లక్షలు నా కుటుంబానికి చెల్లించు వీరేశం అన్న’ అనే పోస్టర్లు నేరేడ అంతటా దర్శనమిచ్చాయి.

ఈ నేపథ్యంలో దుబ్బాక సతీశ్ రెడ్డి వర్గీయులు వీరేశం పర్యటనను అడ్డుకోవచ్చన్న అనుమానంతో భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం ఈ విషయాన్ని వేముల వీరేశంకు అధికారులు తెలియజేశారు. చివరికి అనుచరులతో చర్చించిన వేముల వీరేశం.. నేరేడలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో అధికారులు భద్రతను ఉపసంహరించుకున్నారు.
Telangana
Nalgonda District
veemula veeresam
dubbaka satish
Police

More Telugu News