Hyderabad: నన్ను కిడ్నాప్ చేసి చెన్నైలో వదిలేశారు: హిజ్రా చంద్రముఖి

  • ఇద్దరు వ్యక్తులు బెదిరించారు
  • ఆపై విజయవాడకు తీసుకెళ్లారు
  • పోలీసులకు చెప్పిన చంద్రముఖి
తనను ఇద్దరు వ్యక్తులు బెదిరించి కిడ్నాప్ చేశారని గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థిని చంద్రముఖి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి తనను చెన్నై తీసుకెళ్లి అక్కడ వదిలివేయగా, తాను బుధవారం నగరానికి వచ్చానని వెల్లడించినట్టు సమాచారం.

కాగా, చంద్రముఖి చెబుతున్న కిడ్నాప్ విషయాన్ని పోలీసులు నమ్మడం లేదు. ఆమె తన సెల్ ఫోన్ నుంచి చివరిసారిగా సహచర హిజ్రాలతో మాట్లాడటం, ఆపై అది స్విచ్చాఫ్ రావడం, ముఖానికి మాస్క్ వేసుకుని ఆమె వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో కనిపించడంతో, ఆమే స్వయంగా అదృశ్యం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు ట్రాన్స్ జెండర్లపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లాడన్న ఫిర్యాదులున్న వెంకట్ అనే వ్యక్తి, చంద్రముఖిని కిడ్నాప్ చేసి ఉండవచ్చని కూడా పోలీసులు తొలుత భావించారు. అనంతపురం సమీపంలో వెంకట్ ఉన్నాడని భావించిన పోలీసులు అక్కడికి ప్రత్యేక బృందాలను పంపారు.
Hyderabad
Chandramukhi
Chennai
Goshamahal

More Telugu News