SCR: పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం పెంపు!

  • జాబితాలో హైదరాబాద్ - నర్సాపూర్ రైలు
  • నర్సాపూర్ - నాగర్ సోల్ మార్గంలో కూడా
  • వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే

దేశవ్యాప్తంగా పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిన నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వేగాన్ని పెంచిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ - నర్సాపూర్ మార్గంలో ప్రయాణించే 17256 నంబర్ గల రైలు, నర్సాపూర్ - నాగర్ సోల్ - నర్సాపూర్ మార్గంలో రైలు నంబర్లు 17231, 17232, 17213, 17214 ఉన్నాయి. ఈ వేగం పెంపు నిర్ణయం వచ్చే సంవత్సరం మార్చి నుంచి అమలవుతుందని అధికారులు తెలిపారు.

More Telugu News