Chandrababu: బంగారు తెలంగాణ ఏర్పడాలనేదే నా ఆకాంక్ష: హైదరాబాదులో చంద్రబాబు

  • హైదరాబాదు ఆదాయంతో తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని భావించా
  • పెత్తనం చెలాయించేందుకు వస్తున్నానని నాపై విమర్శలు చేస్తున్నారు
  • దేశాన్ని రక్షించేందుకు నేను, రాహుల్ చేతులు కలిపాం

ఎంతో ఆదాయం వచ్చే హైదరాబాదుతో తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని తాను భావించానని... కానీ, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేసిన తనను తిడుతున్నారని... ఏం తమ్ముళ్లూ నేనెప్పుడైనా టీఆర్ఎస్ ను తిట్టానా? అని ప్రశ్నించారు. తానేదో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు వస్తున్నానని తనపై విమర్శలు గుప్పిస్తున్నారని... టీడీపీ పోటీ చేస్తున్నదే 13 స్థానాల్లో అని చెప్పారు. హైదరాబాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం మహాకూటమిని గెలిపించాలని కోరారు.

37 సంవత్సరాల పాటు కాంగ్రెస్, టీడీపీలు వైరి పక్షాలుగా ఉన్నాయని... ఇప్పుడు తన స్వార్థం కోసమో, రాహుల్ స్వార్థం కోసమో తాము కలవలేదని... దేశాన్ని రక్షించడం కోసమే తాము చేతులు కలిపామని చెప్పారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని... మైనార్టీలు, ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. జీఎస్టీతో జనాల నడ్డి విరుస్తున్నారని అన్నారు. అక్కడ మోదీ బెదిరిస్తుంటే, ఇక్కడ కేసీఆర్ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎవరి పని వారు సక్రమంగా పని చేస్తే ఏ ఇబ్బంది ఉండదని అన్నారు. 

More Telugu News