Rahul Gandhi: ఖమ్మంలో ఆవిష్కృతమైన సరికొత్త కలయిక... ఒకే వేదికపై పక్కపక్కనే రాహుల్, చంద్రబాబు

  • ఖమ్మం బహిరంగసభకు హాజరైన రాహుల్, చంద్రబాబు
  • ఒకేసారి వేదికపైకి ఇరువురు నేతలు
  • ఘన స్వాగతం పలికిన మహాకూటమి నాయకులు
ఖమ్మంలో నిర్వహిస్తున్న మహాకూటమి బహిరంగసభ సందర్భంగా సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. మొన్నటిదాకా ఉప్పూనిప్పుగా ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఒకే వేదికపై ఆసీనులయ్యారు. పక్కపక్కనే కూర్చుని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇద్దరు నేతలు ఒకేసారి సభాప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం కలిసే వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు మహాకూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. వేదికపై సురవరం సుధాకర్ రెడ్డి, గద్దర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మంద కృష్ణ తదితరులు కూడా ఆసీనులయ్యారు.
Rahul Gandhi
Chandrababu
khammam

More Telugu News