kcr: నరేంద్ర మోదీ.. ఇండియా అంటే నీ అయ్య జాగీరా? నీ తాత జాగీరా?: కేసీఆర్

  • రిజర్వేషన్లు పెంచేది లేదని మోదీ చెప్పారు
  • తెలంగాణకు న్యాయం జరగాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిందే
  • తెలంగాణ ద్రోహి చంద్రబాబుకు ఇక్కడేం పని?

తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో ముస్లిం, గిరిజనుల జనాభా పెరిగిందని... అందుకే వారికి 12 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్ల అంశంపై మాట్లాడానని, 33 లేఖలు కూడా రాశారని చెప్పారు. రిజర్వేషన్లను పెంచేది లేదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని మండిపడ్డారు.

'ఇండియా అంటే నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా' నరేంద్ర మోదీ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారాయణ్ ఖేడ్ బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పారు.

కేంద్రంలో మనం చక్రం తిప్పాలంటే 17 ఎంపీ సీట్లు మనకే రావాలని కేసీఆర్ చెప్పారు. హైదరాబాదులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కచ్చితంగా గెలుస్తారని... 16 ఎంపీలను టీఆర్ఎస్ గెలవాల్సి ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్న పలువురు నేతలతో తాను ఇప్పటికే మాట్లాడానని... అందరం కలుస్తామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని, ఆయనకు తెలంగాణలో ఏం పని అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో కరెంట్ ఉండేది కాదని... ఇప్పుడు 24 గంటలూ కరెంట్ ఉంటోందని చెప్పారు. మహాకూటమి వస్తే మళ్లీ కరెంటు సమస్య వస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News