విక్రమ్ కుమార్ తో నాని సినిమా ఓకే అయినట్టే
- నాని కోసం రంగంలోకి దిగిన విక్రమ్ కుమార్
- మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణం
- త్వరలో ప్రకటనచేసే అవకాశం
తన కమిట్మెంట్స్ పూర్తికావడంతో రంగంలోకి దిగమని తాజాగా విక్రమ్ కుమార్ తో నాని చెప్పేశాడు. దాంతో విక్రమ్ కుమార్ అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు ఆ రోజునే తెలియనున్నాయి. ఈ సినిమా తరువాత బన్నీతో విక్రమ్ కుమార్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.