charan: బీహారీ మాఫియా లీడర్ తో తలపడుతోన్న చరణ్!

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • పవర్ఫుల్ విలన్ గా వివేక్ ఒబెరాయ్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' నిర్మితమైంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. ఆయన పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను వుంది. ఈ నేపథ్యంలో వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో బీహారీ మాఫియా లీడర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండేలా బోయపాటి మలిచాడని అంటున్నారు.

గ్రామీణ నేపథ్యం .. కుటుంబం .. బంధాలు .. అనుబంధాలు నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. హీరో చాలా సాఫ్ట్ గా తన పని తాను చేసుకుని వెళుతుంటాడు. అలాంటి హీరో జీవితంలోకి బీహారీ మాఫియా లీడర్ ఎలా ఎంటరయ్యాడనేది ఆసక్తికరంగా మారింది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.   

  • Loading...

More Telugu News