Hyderabad: ఇంకా లభించని గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ... రంగంలోకి ఈసీ!

  • చంద్రముఖి కనిపించకుండా పోయి రెండు రోజులు
  • ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
  • నివేదిక కోరిన ఎన్నికల కమిషన్
తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన హిజ్రా మువ్వల చంద్రముఖి, కనిపించకుండా పోయి రెండు రోజులు గడుస్తుండగా, ఎన్నికల కమిషన్ ఈ విషయమై దృష్టిని సారించింది. చంద్రముఖి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారగా, మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఈసీ ఆదేశించింది. తన బిడ్డ కనిపించడం లేదంటూ చంద్రముఖి తల్లి ఈ ఉదయం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, చంద్రముఖిని ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Hyderabad
Telangana
Elections
Goshamahal
Chandramukhi
Kidnap
EC
Police
Hizra

More Telugu News