NTR Trust: ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు 12 లక్షల మందికి వైద్య సేవలు : నారా భువనేశ్వరి

  • ఎన్టీఆర్‌ ఆశయాలు చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నట్లు స్పష్టీకరణ
  • డిసెంబరు 9న బాలికలకు ఉపకార వేతనాల కోసం పరీక్ష
  • ఎంపికైన వారికి రెండేళ్లపాటు నెలకు రూ.5వేలు చొప్పున సాయం

‘సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు’ అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, ఆయన ఆశయాల సాధనకు ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ తనయ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి తెలిపారు. ఇప్పటి వరకు ట్రస్టు ఆధ్వర్యంలో 12 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు వివరించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలను వివరించారు.

డిసెంబరు 9న ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల ఉపకార వేతనం కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షలో విజయం సాధించిన బాలికలు ఒక్కొక్కరికీ నెలకు రూ.5 వేలు చొప్పున రెండేళ్ల పాటు అందించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా స్పందిస్తున్నామని, రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. పేద, నిరుపేద విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సహాయం అందిస్తున్నామని వివరించారు.

More Telugu News