Chandrababu: చంద్రబాబు ట్రైనింగ్ అంటే ఇలాగే ఉంటుంది మరి: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు మరో బినామీ సీఎం రమేష్
  • పుట్టుకతోనే వేల కోట్ల సంపన్నుడన్నంత బిల్డప్
  • సీఎం రమేష్ టార్గెట్ గా వ్యాఖ్యలు
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను టార్గెట్ చేస్తూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం రమేష్ చంద్రబాబుకు మరో బినామీ అని, ఆయనపై ఐటీ సోదాల్లో బాబు దోపిడీ వ్యవహారాలు బయటకు వచ్చాయని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు. "చంద్రబాబు మరో బినామీ సిఎం రమేశ్ పై ఐటి సోదాల్లో దోపిడీ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. పుట్టుకతోనే వేల కోట్ల సంపన్నుడన్నంత బిల్డప్ ఇచ్చి కోర్టు కెళ్లి అంతు తేలుస్తానని ఐటి అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు. బాబు ట్రెయినింగ్ ఇలాగే ఉంటుంది. దాడుల వార్తల కంటే డెకాయిట్ల వివరణనే కుల మీడియ ప్రముఖంగా ఇచ్చి స్వామి భక్తిని ప్రదర్శించుకున్నాయి" అని ఆయన అన్నారు.
Chandrababu
CM Ramesh
VijayaSai reddy
Facebook

More Telugu News