mukku avinash: నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు .. తట్టుకోలేకపోతున్నాను: 'జబర్దస్త్' అవినాష్

  • పొరపాటు జరిగిపోయింది 
  • సారీ చెప్పినా పట్టించుకోవడం లేదు
  • మా వాళ్లను దారుణంగా తిడుతున్నారు

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో 'ముక్కు' అవినాష్ ఒకరు. తన టీమ్ కి లీడర్ గా వ్యవహరిస్తూ ఆయన తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. అలాంటి అవినాష్ ఈ మధ్య చేసిన ఒక స్కిట్ వివాదాస్పదమైంది. ఆయన చేసిన ఆ స్కిట్ పై జగిత్యాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జరిగిన పొరపాటుకు ఆయన అప్పుడే సారీ కూడా చెప్పేశాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. "నేను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణ చెప్పాను. అయినా వినిపించుకోకుండా సోషల్ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నన్నే కాకుండా మా అమ్మను .. వదినను కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఈ టార్చర్ ను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా, మీరు ఈ టార్చర్ ఆపకపోతే నేను సూసైడ్ చేసుకోవలసి వస్తుంది" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.   

  • Loading...

More Telugu News