China: చైనాలో భారీ పేలుడు... 22 మంది దుర్మరణం!

  • కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన
  • మరో 22 మందికి గాయాలు
  • సహాయక చర్యలు ప్రారంభం
చైనాలో జరిగిన భారీ పేలుడు 22 మంది ప్రాణాలను బలిగొంది. రాజధాని బీజింగ్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంగ్జియాకవు నగరంలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని ఓ యూనిట్ లో పేలుడు సంభవించగా, 22 మంది సజీవదహనం అయ్యారు. అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో బయట నిలిపివుంచిన 50 వాహనాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.
China
Bejing
Blast
Chemical Factory

More Telugu News