paruchuri: విజయ్ దేవరకొండ లేకపోతే 'టాక్సీవాలా' ఇంత బాగా ఆడివుండక పోవచ్చు: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
రాహుల్ సాంకృత్యన్ .. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన 'టాక్సీవాలా', విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. దాదాపు ఈ సినిమా ఇంతవరకూ 30 కోట్ల వరకూ వసూలు చేసింది. అలాంటి ఈ సినిమాను గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ  ప్రస్తావించారు.

"ఇది ఒక హీరో కథ కాదు .. ఒక అమ్మాయి కథ. కానీ ఇది అమ్మాయి కథ కాదు .. హీరో కథ అనిపించడానికి కారణం 'టాక్సీవాలా' అనే టైటిల్. విజయ్ దేవరకొండను పెట్టకపోతే ఈ సినిమా ఇంత బాగా ఆడి ఉండేదా .. ఏమో ఆడివుండకపోవచ్చు. ఎందుకంటే ఫస్టాఫ్ అంతా విజయ్ దేవరకొండనే నడిపించాడు. సెకండాఫ్ అంతా కూడా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ నడిపించాడు. విజయ్ దేవరకొండతోపాటు ప్రతి ఒక్కరూ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆ సహజత్వమే ఈ సినిమా విజయానికి ప్రధానమైన కారణమైంది" అని చెప్పుకొచ్చారు.         
Go Back to Shorts
paruchuri

More Telugu News